-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
Amma Adarsh schools should be speeded up and completed quickly -District Collector V.P. Gautham
అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలి
-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్, కొనిజర్ల మండలం అమ్మపాలెం, బస్వాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పనులను తనిఖీ చేశారు. పాఠశాలకు మంజూరు నిధులు, చేపట్టిన పనులు, పూర్తయిన పనులు, ఇంకనూ పూర్తి కావాల్సిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అడ్వాన్స్ ఎంత అందినది, పనులు పూర్తయిన వాటి విలువ వివరాలు అడిగారు. పూర్తయిన పనులకు వెంటనే బిల్లుల చెల్లింపుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యుద్దీకరణ, టాయిలెట్ బ్లాకులు, త్రాగునీటి సరఫరా పనులు పరిశీలించారు. టాయిలెట్లలో రన్నింగ్ వాటర్ ఉండాలన్నారు. పాఠశాల ప్రవేశ ద్వారం, పాఠశాల లోపల వీధి దీపాలు అమర్చాలన్నారు. పాఠశాలల పునఃప్రారంభంలో వచ్చే పిల్లలకు తమ పాఠశాలలో స్పష్టమైన మార్పు రావాలన్నారు. పాఠశాలల్లో నమోదులు పెరిగేలా బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రుల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. కలెక్టర్ తనిఖీల సందర్భంగా డిఇఓ సోమశేఖరశర్మ, ఎంపిడివో రోజారాణి, ఎంఇఓ శ్యామ్సన్, పాఠశాల హెచ్ఎంలు వై. కోటేశ్వరరావు, సిహెచ్. వెంకటేశ్వర్లు, అధికారులు, తదితరులు ఉన్నారు.