TEJA NEWS

Former MLA who presented BRS party membership insurance cheque

BRS పార్టీ సభ్యత్వం ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే

నారాయణఖేడ్ మండలం పోతాన్ పల్లి (R) గ్రామానికి చెందిన నిరుడి సాయిలు ప్రమాదవశాత్తు ఇటీవల మరణించినదున. వారి భార్య నిరుడి నాగమణి కి మాజీ ముఖ్యమంత్రి BRS పార్టీ అధ్యక్షులు కేసిఆర్ ప్రవేశ పెట్టిన పార్టీ సభ్యత్వం 2 లక్షల రూపాయల చెక్కును నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి అందజేశారు
మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇలాటి పథకం ఏ రాజకీయ పార్టీలో లేదు అన్నారు. మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పార్టీలోని ఏ కార్యకర్త అయిన ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ పథకం ద్వారా మన నియోజకవర్గంలో అనేకమంది కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు.
వారితోపాటు మండల జెడ్పిటిసి లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు పరమేష్, ఉపాధ్యక్షులు నర్సింలు, గ్రామ పార్టీ అధ్యక్షులు సాయి రెడ్డి, నాయకులు గోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, శంకర్, శ్రీధర్ రెడ్డి, భూమ్ రెడ్డి, శరణప్ప, మాజీ సర్పంచ్ అంజయ్య, నరసింహులు, పండరి తదితరులు ఉన్నారు.


TEJA NEWS