TEJA NEWS

ఉదయం రాజమండ్రి (రావులపాలెం) నుండి హైదారాబాద్ వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ టిఎస్ 15 యుఎఫ్ 3797 గల వాహనం అదుపుతప్పి సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలో డివైడర్ను ఢీ కొట్టి ఫల్టి కొట్టింది.
ఎదురుగా సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని తప్పించబోయి ఈ ప్రమాదానికి గురైనట్టు స్థానికులు తెలిపారు.
కారులో డ్రైవర్ నవీన్ కుమార్ సహా 5గురు ప్రయాణికులు ఉండగా నకిరేకల్ లో దిగవలసిన మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను ఆటోలో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
మిగతా ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


TEJA NEWS