TEJA NEWS

కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ పై శంకర్‌పల్లి మండల మోకిల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆదిలాబాద్ సభలో శ్రీరాముడు, హిందువులపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై మండల పార్టీ ఉపాధ్యక్షుడు వెంకటేష్ మరియు, స్థానిక బిజెపి నేతలు ఎస్సై కోటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 5న నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో అద్దంకి దయాకర్ హిందూ దేవతలు రాముడు, సీతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బిజెపి, ఇతర హిందువులు రాముని వారసులు అని చెప్పుకుంటున్నారని, మీరు ఏవిదంగా రాముడి వారసులు అవుతారని ప్రశ్నించారు. రాముడు మీకు చిన్నాయన, సీత మీకు చిన్నమ్మన అని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో హిందూ సంఘాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. కార్యక్రమంలో హరినాథ్, రాజచంద్ర, లింగం, కృష్ణ, కరుణాకర్ చారి, కృష్ణ పాల్గొన్నారు


TEJA NEWS