TEJA NEWS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పసుపులేటి వీరబాబు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ రాజ్యసభలో జరిగిన చర్చలలో విజయసాయిరెడ్డి తెలంగాణ గవర్నమెంట్ ను త్వరలో కూలగొడతామని అలాగే కూలిపోతుందని అన్నారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన అలాగే తెలంగాణ ప్రజలను అవమానపరిచిన విజయ్ సాయి రెడ్డి పై వెంటనే రాజ్య ద్రోహం కేసు నమోదు చేయాలని ఇతని మీద సిబిఐ ఎంక్వయిరీ వేసి మరిన్ని విషయాలు తెలుసుకొని అరెస్టు చేయాలని కోరారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరైనా అపహస్యం చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని దేనికైనా సిద్ధమని హెచ్చరించారు. బాల్కా సుమన్ అలాగే విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోపోతే తెలంగాణ రాష్ట్రంలో తిరగబోనివ్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు nsui డిస్టిక్ జనరల్ సెక్రటరీ మధు, మరియు సందీప్, అజయ్, ప్రణయ్, చింటూ తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS