కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించారు.

కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించారు.

TEJA NEWS

A flag march was organized in the area of ​​Kothapet police station.

గుంటూరు జిల్లా SP శ్రీ తుషార్ డూడీ, IPS మరియు అడిషనల్ ఎస్పీ నచికేట్ షెల్కే, IPS ఆదేశాల మేరకు ఈస్ట్ డివిజన్, కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించారు.

కొత్తపేట సీఐ అన్వర్ భాష మాట్లాడుతూ రాబోవు
ఎలక్షన్ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఈ ఫ్లాగ్ మార్చును నిర్వహిస్తున్నాం.
కొత్తపేట PS పరిధి లో ఉన్న లాడ్జి ల పైన ప్రత్యేక దృష్టిని సారించాం.

బస్టాండు, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో నిరంతర గస్తీ నిర్వహిస్తూ, అపరిచితుల వ్యక్తులు మీద నిఘాను ఏర్పాటు చేసాం.

ఎలక్షన్ కౌంటింగ్ రోజున ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుని తీరుతాం.

కౌంటింగ్ ను దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసాం అని తెలియజేసినారు. ఈ ప్లాగ్ మార్చ్ (కవాతు) నందు కేంద్ర బలగాలు తో పాటు సిఐ, Sk. అన్వర్ బాషా , SI శ్రీమతి K. తరంగిణి , కొత్తపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS