TEJA NEWS

రైతులకు అండగా- హెరిటేజ్ డైరీ

హెరిటేజ్ డైరీ అవగాహన సదస్సు సబ్బవరం మండలం పైడివాడ గ్రామం 10వ వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పైడివాడ అగ్రహారం ఎంపీటీసీ సీరం అప్పలరాజు మాట్లాడుతూ హెరిటేజ్ డైరీ పాలరైతులకు ఎంతో అవసరమని, పాలు వేస్తున్న ప్రతి రైతుకు లీటర్కు విశాఖ డైరీ మీద ఎక్కువ లబ్ధి పొందేలా చేస్తూ అలాగే ఏరువాక బోనస్, మరియు సంక్రాంతి బోనస్ ,ఇవ్వడం చాలా ఆనందకరమైన దీని రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే పాలు పోసే రైతుకు మరియు నామునికి ఇన్సూరెన్స్ ఉచితంగా చేయించారని,ఆయన కొనియాడారు. రీజినల్ మేనేజర్ తులసి నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గనీ తదనంతరం ఆయన మాట్లాడుతూ పాలు పూసే రైతు గేద గాని, ఆవు, గాని మరణిస్తే వాళ్ళ ఇన్సూరెన్స్ నిమిత్తం ఇన్సూరెన్స్ అందుచేతమని, అలాగే రైతు ఎటువంటి ప్రమేయం చెల్లించకుండానే ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షలు సహజ మరణిస్తే 50 వేలు అందించి ఆదుకుంటామన్నారు, అలాగే ప్రతి ఒక్క రైతుకి పశువులు ఏ విధంగా ప్రోత్సాహంగా ఉండాలి, ఏ విధంగా వాటికి సరైన సదుపాయాలు సరైన మెడిసిన్, సరైన దాన యేస్తే ఏ విధంగా ఆదుకోవాలని ఏ విధంగా అయితే ఆరోగ్యంగా ఉంటుందో రైతులకు క్లుప్తంగా వివరించి వాళ్లకి సూచిక సందేశాలు అందించారు,
ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ సీరం అప్పలరాజు, హెరిటేజ్ రీజనల్ మేనేజర్ తులసి నాయుడు గారు, సూపర్వైజర్ నాని, వెటర్నరీ వైద్యులు గణేష్, సెంటర్ సూపర్వైజర్ బలిరెడ్డి అప్పలరాజు, రాపర్తి కనకరాజు, రాపర్తి నాగరాజు, బల్రెడ్డి తాతబాబు, రాపర్తి కనకరాజు మరియు పాల రైతులు పాల్గొన్నారు…


TEJA NEWS