TEJA NEWS

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పేరెంట్స్‌ కమిటీ స్థానంలో..స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ

ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పాలనలో మార్పులు చేస్తోంది.

గత ప్రభుత్వంలో అమలైన కొన్ని విధానాలను మార్చుతూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

పాఠశాలల్లో ఉండే పేరెంట్స్‌ కమిటీ స్థానంలో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీని ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించారు.

స్కూళ్లలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఇప్పటి వరకు పేరెంట్స్‌ కమిటీలు అమల్లో ఉన్నాయి. అయితే తాజాగా వీటిలో స్థానంలో స్కూల్ మేనేజ్‌మెంట్‌ కమిటీలను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలల్లోమధ్యాహ్నభోజనం
మౌలిక సదుపాయాలను పర్యవేక్షించడం ఈ మేనేజ్‌మెంట్ కమిటీ విధులు.

ఇక ఆగస్టు 8వ తేదీన ఇందుకు సంబంధించి ఎన్నికలను నిర్వహించనున్నారు. అదే రోజు కమిటీ ప్రమాణ కార్యక్రమం ఉంటుంది. అదే రోజు తొలి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్కూల్‌ పేరెంట్స్‌ కమిటీల పదవి కాలం తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది

Print Friendly, PDF & Email

TEJA NEWS