TEJA NEWS

తమిళనాడు రాష్ట్రంలోని టపాకాయల తయారీకి ప్రసిద్ధి చెందిన శివకాశిలో భారీ పేలుడు సంభవించింది.

వివరాల్లోకి వెళితే.. బాణ సంచా తయారీ కేంద్రంలో ముడి సరుకును లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ విస్పోటనం జరిగింది. ఈ ప్రమాదంలో పేలుడు ధాటికి మొత్తం ఏడుగురు స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు.

అందులో ఐదుగురు మహిళలలే ఉన్నట్లుగా తెలుస్తోంది. గమనించి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా ఫైరింజన్లు అక్కడి వెళ్లి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

అయితే, మంటలు అదుపు చేస్తున్నప్పటికీ కార్మాగారం లో మందుగుండు సామగ్రి ఎక్కువ ఉండటంతో మంట లు ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


TEJA NEWS