TEJA NEWS

మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన RAW STRENGTH CALISTHENICS జిమ్ ను మాజీ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ నేటి యాంత్రిక జీవితంలో, మానవుడి నిత్య జీవితంలో మానవుడికి శారీరక శ్రమ ఎంతో అవసరం అని , శారీరక శ్రమ తో పాటు మానసిక దృఢత్వం లభిస్తుంది అని , క్రీడలు మానసిక ఉల్లాసంను పెంపొందిస్తాయి అని , స్నేహ భావం పెంపొందుతుంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. యాంత్రిక జీవనంలో ప్రజలకు క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయి అని ప్రతి ఒక్కరు ఎదో ఒక క్రీడను ఎంచుకొని ఉన్నత స్థితిలోకి రావాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు .విజేతలకు బహుమతులు ప్రధానం చేసి, అభినందనలు తెలియచేసారు. అన్ని హంగులతో ,సకల సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరిగినది అని నిర్వాహకులను ఎమ్మెల్యే గాంధీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, శివ, సాయి, శ్రీనివాస్ , కాజా , మరియు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS