పెద్దపల్లి బార్ అసోసియేషన్ సభ్యులకు వినతి పత్రం సమర్పించిన పుడ సాధన సమితి సభ్యులు.
పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పుడ) ఏర్పాటు కొరకు ఒక్కరోజు కోర్టు విధులను బహిష్కరించి మద్దతు తెలుపాలని న్యాయవాదులకు వినతి పత్రం సమర్పించిన పుడ సాధన సమితి సభ్యులు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ సభ్యులను కలసి పెద్దపల్లి జిల్లా ఏర్పడిన నాటి నుండి పెద్దపల్లికి జరుగుతున్న అన్యాయాలపై సుధీర్ఘంగా చర్చించి ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పేరున కాకుండా రామగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో జీ వో ను తీసుకొని రావడం విషయంలో పెద్దపల్లి పేరున పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పుడ) ఏర్పాటు కొరకు పుడ సాధన సమితి చేస్తున్న న్యాయమైన పోరాటానికి బార్ అసోసియేషన్ మద్దతునిచ్చి ఒక్క రోజు విధులను బహిష్కరించాలని కోరడం తోనే
వెంటనే స్పందించి మీరు కోరిన విధంగానే బార్ అసోసియేషన్ ద్వారా తీర్మానం చేసి మీ న్యాయమైన పోరాటానికి మద్దతుగా కోర్టు విధులను ఒక్క రోజు బహిష్కరిస్తామని
అధ్యక్షులు లకిడి భాస్కర్,సెక్రటరీ కోటగిరి వాసు, సీనియర్ న్యాయవాది ఉప్పు రాజు,లైబ్రరీ సెక్రటరీ బొంకూరి సంతోష్ బాబ్జి, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ బర్ల రమేష్ బాబు,ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వడ్లకొండ రమేష్,పుట్ట రవి న్యాయవాదులు బొంకూరి మమతా,ఝాన్సీ ,దోనేటి కిష్టయ్య, తదితరులు హామీ ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పుడ సాధన సమితి నాయకులు బూషణ వేణి రమేష్ గౌడ్, బొంకూరి సురేందర్ సన్ని,కావేటి రాజ గోపాల్, తూముల శ్రీనివాస్, బొడ్డు పల్లి రామ్మూర్తి, అలువాల రాజేందర్, కల్లెపల్లి రవి, తాళ్ళ పల్లి అంజయ్య, గద్దల వినయ్ కుమార్ తదితరులు పాల్గోన్నారు.