TEJA NEWS

ఉచిత ఇసుక పధకంలో నిరాశ చెందుతున్న ప్రజానీకం

దళారుల చేతుల్లోకి ఉచిత ఇసుక

వందలాదిగా ట్రాక్టర్లతో ఇసుక రవాణా

సామాన్య ప్రజలకు అప్పుడు ఇప్పుడు ఒకటే ధర

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో ఉచిత ఇసుక చాలా ప్రధానమైన అంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు ఇసుకను ఉచితంగా అందజేయాలనే ఆలోచనతో మంచి నిర్ణయం తీసుకున్నప్పటికీ అది సామాన్య ప్రజలకు అందడం లేదని తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

ఇసుక ర్యాంపులో ఒక ట్రాక్టర్ కు 500 రూపాయలు వసూలు చేయగా అది ప్రజలకు చేరేసరికి 2500 నుండి 3000 వరకు ధర పలుకుంతుంది

మధ్యలో అటు ప్రభుత్వఆదా యానికి గండి పడటంతో పాటు ఇటు ప్రజలకు ఉచిత ఇసుక దక్కడం లేదని ప్రజలు నిరుత్సాహపడుతున్నారు

ఉచిత ఇసుక పేరుతో దళారులు వందలాదిగా ట్రాక్టర్లతో ఇసుకను తరలించి అక్కడ నుండే లారీల్లో నింపుకొని 10 నుంచి 15 వేల రూపాయలకు అమ్ముకుంటూ ఉచిత ఇసుక పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోవడంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి

ఇప్పటికైనా స్టానిక ప్రజా ప్రతినిధులు అధికారులు జోక్యం చేసుకుని అక్రమ ఇసుక రవాణా అడ్డుకుని సామాన్య ప్రజలకు ఇసుకను అందుబాటులో వుండే విధంగా చూడాలని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు

మరొక ముఖ్య విషయం ఈ ఇసుకను తరలించే క్రమంలో ఫిట్ నెస్ లేని చాలా ట్రాక్టర్లు రోడ్ పైకి తెచ్చి డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్ లతో నడిపిస్తు రోడ్ పై పోటా పోటీగా నడుపుతూ ప్రమాదలకు గురి చేసే విధంగా ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు


TEJA NEWS