TEJA NEWS

A resident of Nagayalanka died in a road accident

విజయవాడ :-
కృష్ణాజిల్లా నాగాయలంక మండలం రేమాలవారిపాలెం గ్రామానికి చెందిన మత్తి మురళి విజయవాడ రూరల్ లోని రామవరప్పాడు రింగ్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

తన కుమారుడిని ప్రతీ రోజు క్రికెట్ కోచింగ్ నిమిత్తం తీసుకు వెళ్తున్నాడు.

కోచింగ్ కు తీసుకువెళ్తున్న క్రమంలో లారీ ఢీకొనడంతో మురళి లారీ చక్రం కింద పడిపోగా, కుమారుడు పక్కకు పడిపోయాడు.

ఈ ప్రమాదంలో మురళి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద ఘటన చూసి పలువురు చల్లించిపోయారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


TEJA NEWS