TEJA NEWS

ప్రజల సమస్యలకు సంతృప్తికరమైన పరిష్కారం అందించాలి

అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం విజయవాడ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఫిర్యాదులను శాఖాధిపతులే ఫీల్డ్ కి వెళ్లి పరిశీలన చేసి తగు పరిష్కారాన్ని ఇవ్వాలని శాఖాధిపతులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి ఒక్క ఫిర్యాదు ఒక ఉదాహరణగా తీసుకొని వారికి పరిష్కారం ఇవ్వటమే కాకుండా ఇటువంటి సమస్యలకు ప్రజలందరికీ పరిష్కార మార్గం చూపించేటట్టుగా విధులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. ఉదాహరణకి పబ్లిక్ టాయిలెట్ నుండి దుర్వాసన వస్తున్నదని ఒక ఫిర్యాదు రాగా, ఆ సమస్యని తక్షణమే పరిష్కరించడమే కాకుండా విజయవాడ పరిధిలో ఉన్న మరుగుదొడ్ల అన్నిటినీ పరిశీలించి ఇటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే బాధ్యత శాఖాధిపతులదని అన్నారు. విజయవాడ లో ఉన్న అన్ని శాఖలు ఒకరి ఒకరు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎటువంటి సమస్యలు ఎత్తకుండా చూసుకోవాలి అని అన్నారు.

ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం ఫిర్యాదులు 17 అందగా, అందులో అత్యధికంగా పట్టణ ప్రణాళిక విభాగానివి 5, ఇంజనీరింగ్ సంబంధించినవి 4, ప్రజారోగ్యం 3, యు సి డి 2, హార్టికల్చర్, రెవెన్యూ, ప్రాజెక్ట్స్ సంబంధించినవి 1.

ఈ కార్యక్రమంలో విజయవాడ కమిషనర్ ధ్యానచంద్రతో పాటు అడిషనల్ కమిషనర్ జనరల్ డాక్టర్ ఏ మహేష్, అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ కే వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ ఏం ప్రభాకర్ రావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నవళి, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, డిప్యూటీ సిటీ ప్లానర్ జూబిన్ చీరన్ రాయ్, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాసరావు, అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణమూర్తి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ బి సోమశేఖర్ రెడ్డి, ఆర్ ఎఫ్ ఒ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS