TEJA NEWS

నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 నియోజకవర్గాల నుండి రామ భక్తులు అయోధ్యలోని శ్రీ బాల రాముని దర్శనం కోసం వెళ్తుండడంతో రామ భక్తుల కోసం భువనగిరి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేకంగా రైలును ఏర్పాటు జరిగింది…. ఈ సందర్భంగా బిజెపి జిల్లా నాయకులతో కలిసి భువనగిరి రైల్వే స్టేషన్ కు విచ్చేసిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ హిందువుల చిరకాల కోరిక అయినా అయోధ్య రామ మందిరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో నిర్మాణం కావడం చాలా గొప్ప విషయమని తెలియజేస్తూ అయోధ్య వెళుతున్న రామ భక్తులకు శుభాకాంక్షలు తెలియజేసి అయోధ్య యాత్రకు వెళుతున్న రైలును జెండా ఊపి ప్రారంభించడం జరిగింది….

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, చల్లా శ్రీలత రెడ్డి, కడియం రామచంద్రయ్య, అసెంబ్లీ కన్వీనర్లు కర్నాటి కిషన్, కాపా రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ మరియు జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు


TEJA NEWS