TEJA NEWS

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిన్న చార్జిషీట్ వేసిన సీఐడి

నేటి విచారణలో సీఐడీకి చుక్కెదురు

చార్జిషీట్ వేయాలంటే సెక్షన్ 19 ప్రకారం అనుమతి ఉండాలన్న కోర్టు

శివ శంకర్. చలువాది

ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, లింగమనేని రమేశ్, లింగమనేని రాజశేఖర్ లతో పాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంటూ ఏపీ సీఐడీ నిన్న ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే, నేటి విచారణలో సీఐడీకి చుక్కెదురైంది. ఐఆర్ఆర్ కేసులో సీఐడీ చార్జిషీట్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం అనుమతి లేదని కోర్టు స్పష్టం చేసింది. చార్జిషీట్ వేయాలంటే సెక్షన్ 19 ప్రకారం అనుమతి తప్పనిసరి అని పేర్కొంది.


TEJA NEWS