అంగన్వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ చేసిన ఏసీడీపీఓ

అంగన్వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ చేసిన ఏసీడీపీఓ

TEJA NEWS

ACDPO conducted surprise inspection at Anganwadi centers

సూర్యాపేట పట్టణం 20వ, వార్డు జమ్మిగడ్డ లో అంగన్వాడీ కేంద్రాలను సూర్యాపేట ఏసీడీపీఓ శ్రీజ తనిఖీ చేశారు. చిన్నారులకు పరిసరాల పరిశుభ్రత గురించి, భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడగాలని సూచించారు. ప్రతి నెల మొదటి వారంలో పిల్లల బరువులను చూసి వారికి తగినంత పోషకాహరాన్ని అందించాలని వారు అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు . పిల్లలకు సమయానుకూలంగా పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. అంగన్వాడి కేంద్రాల్లోని స్టాకును వెరిఫికేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు సమయపాలన పాటిస్తూ పిల్లలను శ్రద్ధతో చూడాలని ఆమె అన్నారు. అనంతరం ఓ చిన్నారి జన్మదిన వేడుకల సందర్బంగా అంగన్వాడీ కేంద్రాలలో పలక, బలపాలు పంపిణీ చేశారు.చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో సూపర్వైజర్ నగిత,
కౌన్సిలర్ అన్నేపర్తి రాజేష్,అంగన్వాడి స్కూల్ టీచర్లు పద్మ ,భరణి రెడ్డి,అనిలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS