దోబీ ఘాట్ ఆక్రమణ దారులపై చర్యలెప్పుడు?
** మాసిన బట్టలు ఉతికి నిరసన
** ఎమ్మార్వో హామీతో ఆందోళన విరమణ
తిరుపతి: రూరల్ మండలం వేదాంత పురంలోని 214 సర్వే నెంబర్లు 56 సెంట్లు విలువైన భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రాస్ ఆఫీస్ నుండి తిరుపతి రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం వరకు నెత్తిన బట్టల మూటలు పెట్టుకొని నినదీస్తూ
తిరుపతి రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.
అనంతరం మాసిన బట్టలను ఉతికి నిరసన తెలియజేశారు….ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎస్.జయచంద్ర,
రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు మునిరత్నం మాట్లాడుతూ ధోబి ఘాట్ ఆక్రమణ విపరీతంగా పెరిగిపోయినాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు యదేచ్చగా భూములు ఆక్రమిస్తున్నారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలోని రజకుల కోసం 56 సెంట్లు ప్రభుత్వం కేటాయించింది కానీ అక్కడున్న పెత్తందారులు అడ్డుకొని ఈ భూమి మాది అని అడ్డం వచ్చిన వారిని గాయపరిచి దాడిచేసి రక్త గాయాలు చేసిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రజకులకు సంబంధించిన భూమి 2005 లో కోర్టుకు వెళ్లడం జరిగింది… అది 2013లో రజకులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారులు ఆ భూమి జోలికి పోలేదు. అనేకసార్లు విన్నవించినా ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా కనికరించడం లేదు.
కలెక్టర్ స్థాయి నుంచి ఎమ్మార్వో ఆఫీసులు చుట్టూ తిరిగినా ఏమి ప్రయోజనం లేదు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఇల్లు నిర్మాణం చేసుకున్న వారికి అధికారులు వత్తాసు పలుకుతూ పేద రజకులకు అన్యాయం చేస్తున్నారు..
ఈ సందర్భంగా ఆందోళన కార్యక్రమం దగ్గరకు వచ్చి ఎమ్మార్వో వివరణ ఇచ్చారు.
ఉదయం సర్వేలను, రెవెన్యూ అధికారులను పంపి సర్వే చేయిస్తామని,ప్రభుత్వ భూమి అని తేలితే అక్కడ బోర్డు పెడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తిరుపతి రూరల్ కార్యదర్శి సుమన్, సిఐటియు జిల్లా నాయకులు చిన్నబాబు, రజక సంఘం నాయకులు మధు, సురేంద్ర, భాస్కర్, రమణ, రాజశేఖర్ బాధిత మహిళలు తదితరులు పాల్గొన్నారు.
