మహిళల ప్రపంచ కప్ కైవసంపై సంబరాలు
తిరుపతి: మహిళల తొలి ప్రపంచ కప్ కైవసంపై తిరుపతిలో సంబరాలు జరిగాయి. దక్షిణాఫ్రికాపై అద్భుతమైన విజయం సాధించిన ఆల్ రౌండ్ ప్రదర్శనలో చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసిన తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష. కేక్ కటింగ్ నిర్వహించి సంబరాలు చేసుకున్న మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు, వై.సి.పి.మహిళ నాయకురాళ్లు. తిరుపతి పద్మావతి పురం పార్టీ కార్యాలయంలో సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, పార్టీ నగర మహిళా విభాగం అధ్యక్షురాలు కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
మేయర్ మాట్లాడుతూ భారత ప్రపంచ ప్రపంచకప్ మహిళలు లో అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన తో సమష్టి గా రాణించి ఫైనల్ లో గొప్ప విజయాన్ని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు కు అభినందనలు, శుభాకాంక్షలు. భారతీయులందరూ ఈ ప్రదర్శన చూసి పులకించిపోయారు. ప్రత్యేకించి ఈ విజయం దేశం లోని ప్రతి మహిళకు, బాలికకు గర్వ కారణం, స్ఫూర్తి దాయకం. ప్రపంచానికి భారత శక్తి ఏమిటో చాటి చెప్పిన శుభ సందర్భం. దేశ మహిళా క్రికెట్ రాబోయే రోజుల్లో ఓ మేలి మలుపు తిరగడానికి ఈ అద్భుత విజయం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ విజయం పరంపర కొనసాగాలని కోరుకొంటూ కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ కు, మిగతా జట్టు సభ్యులకు నా అభినందనలు తెలియ జేస్తున్నాము. ఈ వేడుకల్లో మేయర్ డాక్టర్ శిరీషతో పాటు మహిళ కార్పొరేటర్లు కోటేశ్వరమ్మ, ఆరణి సంధ్య, ఆదిలక్ష్మి, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ మహిళలు, నగర మహిళా విభాగం నాయకురాలు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
