TEJA NEWS

అభివృద్ధి పనుల్లో వేగం నాణ్యత పై అధికారుల పర్యవేక్షణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం
ఆసుపాక గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల పనుల నిర్మాణంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. పనులలో భాగంగా బేస్ మెంట్ స్థాయిలో స్లాబ్ వేయడం పూర్తయింది. పనులు నాణ్యతతో సాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. పురోగతి వివరాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి బింగి రామకృష్ణ తెలిపారు. నిర్మాణాల వేగాన్ని స్థానిక ప్రజలు మెచ్చుకున్నారు.