రాంకీ యాజమాన్యం విడుదల చేస్తున్న కాలుష్యంపై చర్యలు తీసుకోవాలి.
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి ఫిర్యాదు.
పరవాడ మండల కేంద్రమైన పరవాడ ఊర చెరువు, పెద్ద చెరువు, సన్యాసి చెరువు, మొల్లోడు గడ్డ రాంకీ యాజమాన్యం అక్రమంగా ఫార్మా పరిశ్రమల నుండి విడుదలవుతున్న వ్యర్థ రసాయనిక జలాలను శుద్ధి చేయకుండా చెరువుల్లోకి విడుదల చేయడం వలన చెరువులు,భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయని వెంటనే చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ దయానిధికి ఫిర్యాదు చేస్తూ లేఖలో కోరారు.
పెద్ద చెరువులో చేపలు చనిపోతున్నాయని, పశువులు జీవరాసులు నీళ్లు తాగడానికి పనికి రావడం లేదని, భరిణికం, పరవాడ, తానం, లంకెలపాలెం, తాడి, సాలాపు వాణి పాలెం, గొర్లవానిపాలెం, బొద్దపు వాని పాలెం, గ్రామాలు ఫార్మా పరిశ్రమలు విడుదల చేస్తున్న కాలుష్యంతో అల్లాడుతున్నారని కాలుష్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని, సమీపంలో చెరువులు కాలవల్లోకి వ్యర్థ రసానికి జలాలు విడుదల కాకుండా ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలని ముత్యాలంపాలెం సముద్రం లో కూడా వ్యర్థ జలాల శుద్ధి చేయకుండా విడుదల చేయడం వలన చేపల ముత్యువాత పడుతున్నాయని ఇటీవల కాలంలో ఉప్పు ఏరులో చేపలు చనిపోయాయని ఈ ఫిర్యాదు లోపేర్కొన్నారు