TEJA NEWS

మీడియా ప్రతినిధులపై సినీనటుడు మోహన్ బాబు దాడిని తీవ్రంగా ఖండిస్తూ తిరుపతి ఎస్పీ కి ఫిర్యాదు చేసిన మన తిరుపతి ప్రెస్ క్లబ్ పాత్రికేయులు

            ప్రముఖ సినీ నటుడు శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేసిన దాడిని వ్యతిరేకిస్తూ మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు తపసి మురళి రెడ్డి, అధ్యక్షులు వార్తల శేషాద్రి యాదవ్, ఉపాధ్యక్షుడు డి.వి.రమణ, ట్రెజరర్ మని రమేష్, ఈసీ మెంబర్ వేణు గుండ్లూరి, పి.ఆర్.ఓ కాణిపాకం హేమ కుమార్ చేతుల మీదుగా తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మంచు మోహన్ బాబు తన కుటుంబంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన నేపథ్యంలో వీడియో కవరేజ్ కి వెళ్లిన సుమన్ టీవీ ఉమా శంకర్, కెమెరామెన్ నరసింహ పై శ్రీ విద్యానికేతన్ బౌన్సర్లు దాడికి పాల్పడి రక్తగాయాలు చేశారు. మరుసటి దినమున హైదరాబాదులోని తన నివాసం వద్ద సినీ నటుడు మంచు మోహన్ బాబు టీవీ9 రిపోర్టర్ రంజిత్, వీడియో జర్నలిస్ట్ సూర్య పై దాడి చేసి రక్త గాయాలు చేసారు. సమాజానికి నాలుగో స్తంభమైన మీడియా ప్రతినిధులపై చట్ట విరుద్ధంగా అక్రమంగా దాడి చేసిన మోహన్ బాబు అతని అనుచరులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించి నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో మన తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మరియు పాత్రికేయ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


TEJA NEWS