బాధ్యతతో ప్రజా ఫిర్యాదుల ను పరిష్కరించండి.
కమిషనర్ ఎన్.మౌర్య
బాధ్యతతో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటిని పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులు ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమంలో సుమారు 49 మంది సమస్యలతో కూడిన వినతులను కమిషనర్ కి అందజేశారు. తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ ఆర్.సి. మునికృష్ణ, అనిల్ కుమార్లు లు కమిషనర్ కు వినతులు సమర్పించారు.
ఇందులో ముఖ్యంగా తమకు టీ.డి.ఆర్.బాండ్లు ఇప్పించాలని, పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని, అర్హులైన వారికి పింఛన్లు ఇప్పించాలని, తమ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని రక్షణ కల్పించాలని, మురుగు కాలువల్లో చెత్త తొలగించాలని,వినతులు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని, వర్షాల్లో నగరపాలక సంస్థ సేవలు బాగున్నాయని పలువురు చెప్పారు. అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ ఆఫీసర్స్ సేతుమాధవ్, రవి, డి.సి.పి. మహాపతి, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి, డి.ఈ.లు, ఏ.సి.పి.లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు పీజీఆర్ఎస్ లో ఉన్నారు.