TEJA NEWS

విద్యార్థులు విద్యారంగ సమస్యలపై ఉద్యమించాలి ఏఐఎస్ఎఫ్ పిలుపు..

రామగల్ల నరేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్

సిద్దిపేట జిల్లా చేర్యాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామగల్ల నరేష్ పిలుపునిచ్చారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య చేర్యాల డివిజన్ సమితి ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రారంభించి మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిందని భారత దేశంలో మొట్టమొదటి విద్యార్థి సంఘంగా చరిత్రపుటల్లో నిలిచిందని దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని అలాంటి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ప్రతి సంవత్సరం విద్యార్థుల నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తుందని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకొని సభ్యత్వాన్ని తీసుకోవాలని పిలుపునిచ్చారు అదేవిధంగా విద్యారంగంలో వస్తున్న మార్పులను గమనిస్తూ నిరంతరం ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల పక్షాన గల్లి నుండి ఢిల్లీ వరకు పాఠశాల నుండి యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థులను సంఘటితం చేస్తూ పోరాటం నిర్వహిస్తుందని తెలియజేశారు అదే విధంగా విద్యా కాషాయకరణ వ్యతిరేకంగా విద్యా కార్పోరేట్ కారణకు వ్యతిరేకంగా ఈవ్ టీజింగ్ ర్యాగింగ్ కు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ ఉద్యమిస్తుందని తెలియజేసారు ఘనమైన చరిత్ర కలిగిన విద్యార్థి సంఘంలో విద్యార్థులు చేరాలని పిలుపునిచ్చారు. తదనంతరం గౌతమి ఒకేషనల్ జూనియర్ కళాశాల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా గర్ల్స్ కన్వీనర్ ఆకుల శిరీష జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎద్దు కార్తీక్ మండల కన్వీనర్ యాసిన్ తేజ శ్రావణి శివాని అభినవ్ తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS