TEJA NEWS

Alkalic Metals Employees Union met former MLA and Congress leader Kuna Srisailam Goud

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన ఆల్కాలిక్ మెటల్స్ ఎంప్లాయిస్ యూనియన్ (INTUC) నూతన కమిటీ సభ్యులు..


కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్, D.పోచంపల్లి లోని ఆల్కాలిక్ మెటల్స్ కంపెనీ
ఎంప్లాయిస్ యూనియన్ (INTUC) నూతన కమిటీ అధ్యక్షులుగా ఎం.రాము గౌడ్ , కంపెనీ అడ్వైసర్లు గా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , మాజీ జెడ్పి వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి లను ఇటీవల ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఈరోజు యూనియన్ అధ్యక్షుడు, కౌన్సిలర్ ఎం.రాము గౌడ్ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు, కంపెనీ ఉద్యోగులు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత, కంపెనీ అడ్వైసర్ కూన శ్రీశైలం గౌడ్ ని తన నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను మాజీ ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి అభినందించారు. కంపెనీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ, ఉద్యోగుల సంక్షేమం కొరకు యూనియన్ పని చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు కౌన్సిలర్ ఎం.రాము గౌడ్, ప్రధాన కార్యదర్శి శంకర్ మరియు కమిటీ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


TEJA NEWS