జిల్లా పరిస్ధితులు ఎప్పటికప్పుడు తెలుసు కుంటున్న రాష్ట్ర వ్యవశాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
వాతావరణ శాఖ అంచాన ప్రకారం భారీ వర్షాలు పడే అవకాశం
వైద్య, రెవెన్యూ, పోలీసుశాఖలతో పాటు ఇతర శాఖలు అధికారులు అందుబాటులో ఉండాలి
అత్యవసర మైతే తప్పా ప్రజలు బయటకు రావద్దు
రాష్ట్ర వ్యవశాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం :
జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులను రాష్ట్ర వ్యవశాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు.వైద్య,రెవెన్యూ, పోలీసుశాఖలతో పాటు ఇతర శాఖలు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రధానంగా మత్య్సకారులు వెటకు వేళ్లరాదని తెలిపారు. ఎక్కడ కూడా ప్రాణ ఆస్ధి నష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమున్న చొట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అవసరమైతే తప్ప ప్రజలకు బయటకు రాకుండా ఉండాలని కోరారు. వాతావరణ శాఖ అంచనాల మేరకు రేపు రాత్రికి ఒడిశాలోని పూరి. పశ్చిమ బెంగాల్ లో దిఘా మధ్య తీరం దాటుతుటుందని ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ అందుబాటు లో ఉంచామని తెలిపారు. అత్యవసరమైన వారు సంప్రదించాలని కోరారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో ఎప్పటి కప్పుడు చరవాణిలో మాట్లాడి జిల్లా పరిస్ధితులు అడిగి తెలుసుకుంటున్నారు.