TEJA NEWS

వచ్చే ఏడాది జనవరి 3 న,నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్

హైదరాబాద్:
బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణను వచ్చే ఏడాది జనవరి 3 కు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు.

రెగ్యులర్ బెయిల్ మం జూరు చేయాలని కోరుతూ డిసెంబర్ 24న ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడానికి అల్లు అర్జున్ కారణమని ఆయన వాదించారు.

అల్లు అర్జున్ ను డిసెంబర్ 13న చిక్కడపల్లి పోలీసు లు అరెస్ట్ చేశారు. అదే రోజున హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యం తర బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటి షన్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది.

ఈ సూచన మేరకు అల్లు అర్జున్ తరపు న్యాయవా దులు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు


TEJA NEWS