దాదాపుగా పూర్తి అయ్యిన టీడీపీ – జనసేన – సీట్ల షేరింగ్ ?
ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్సీపీ పార్టీని అధికారంలోకి రాకుండా చేయటము కోసం పొత్తులు ప్రధానమని భావించిన ప్రతిపక్ష పార్టీలు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జన సేన పార్టీ, బీజేపీ పార్టీ మద్య సీట్ల సర్దుబాటు దాదాపుగా ఖరారు అయ్యిందని వినికిడి.
ఈ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 30 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు అలాగే బీజేపీ పార్టీ మీ 5 పార్లమెంటు స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు అంటున్నారు.
జనసేన మూడు పార్లమెంట్ స్థానాలకు గానూ అనకాపల్లి పార్లమెంట్ లో నాగేంద్ర బాబు, మచిలీపట్నం లో బాల శౌరి, కాకినాడ పార్లమెంటు స్థానాలు దాదాపుగా వారీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు పూర్తి అయ్యిందని అంటున్నారు. ఈ సందర్భంగా సీట్ల సర్దుబాట్లు కారణంగా కొంత మంది నేతలు పార్టీ కోసం త్యాగాలు చేయటం కోసం సిద్ధపడాలని పవన్ కళ్యాణ్ సూచించారు.