బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లోని పారిశ్రామికవేత్తలకు పలు సూచనలు చేశారు. ఆయన చిత్తూరు నుంచి తిరుగు ప్రయాణంలో భాగంగా బెంగళూరులోని హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా సెంచురీ గ్రూప్ సంస్థల ఈడీ అశ్విని పై, ఎండీ రవీంద్ర పై తదితరులు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు వారికి సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా అమరావతిలో పెట్టుబడుల విషయంపై నిర్ణయం తీసుకుంటామని అశ్విని పై తెలిపారు. ఈ సందర్భంగానే చంద్రబాబును కర్ణాటక ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ ఏడీజీపీ మువ్వ చంద్రశేఖర్, కర్ణాటక తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెల్లం రమణ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి
Related Posts
ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు
TEJA NEWS ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని…
శబరిమలకు పోటెత్తిన భక్తులు
TEJA NEWS శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు.…