TEJA NEWS

అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి..

మోడీ మౌనం విడాలి…

అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ లో పాల్గొని నిరసన తెలిపి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేసి బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోసెస్ ఆనంద్ కుమార్ …

ఏఐసీసీ,టీపీసీసీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ ఇటీవలే ప్రకటించిన సందర్బంగా..

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాక్యాలకు నిరసనగా హనుమకొండ అంబేద్కర్ జంక్షన్ లోని అయన విగ్రహం వద్ద నిరసన తెల్పి క్షమాపణ చెప్పాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు ,నాయిని రాజేందర్ రెడ్డి ,స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు ,కడియం శ్రీహరి ,వర్దణపేట శాసనసభ్యులు కే ఆర్ నాగరాజు ,కుడా చైర్మన్ ,ఇనగాల వెంకట్రామ్ రెడ్డి రెడ్డి తో కలిసి పాల్గొని డిమాండ్ చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,మోసెస్ ఆనంద్ కుమార్ …

అనంతరం ఒక ప్రకటన లో ఆనంద్ కుమార్ మాట్లాడుతూ..పార్లమెంట్‌లో అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణతో పాటు షా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము.దాని కోసం మేము పోరాడుతూనే ఉంటాము అని ఆన్నారు,దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది,విస్తృతంగా నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ,ప్రధాని మౌనంగా ఉన్నారు,అవమానకరమైన వ్యాఖ్యలు బిజెపి యొక్క నిజమైన ఉద్దేశాలను మరియు ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి.అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేసారు..

అంబేద్కర్ ఆశయాలను కాపాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నిబద్దతను గుర్తు చేస్తుంది అని అన్నారు..

అనంతరం ఎమ్మెల్యే లు,కుడా చైర్మన్ భారత రాష్ట్ర పతి శ్రీమతి ద్రౌపతి ముర్ము కి లేఖ రాసి జిల్లా కలెక్టర్ కి మెమోరాండం అందిచారు..

ఈ కార్యక్రమం లో రాష్ట్ర,జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు…


TEJA NEWS