TEJA NEWS

కుప్పంలో చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం తీసుకున్న అధికారి..

సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం మండలం శివపురం వద్ద వ్యవసాయ భూమిలో ఇంటి నిర్మాణానికి ల్యాండ్ కన్వర్షన్ కోసం చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు.

శాంతిపురం డిప్యూటీ సర్వేయర్ హుస్సేన్ అత్యుత్సాహం ప్రదర్శించి ఇంటి నిర్మాణానికి అనుమతులకుగాను రూ. 1.80లక్షలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

చివరకు లక్ష రూపాయలు లంచం తీసుకున్నాడు.

డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్న విషయాన్ని ఇటీవల సీఎం హోదాలో కుప్పంకు వెళ్లిన చంద్రబాబు నాయుడు దృష్టికి స్థానిక టీడీపీ నేతలు తీసుకెళ్లారు.

కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులుతో విచారణ జరిపించాలని ఆ సమయంలో చంద్రబాబు ఆదేశించారు.

దీంతో సర్వేశాఖ ఏడీ గౌస్ బాషాతో శాఖాపరమైన విచారణ చేయించగా.. డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నది నిజమేనని తేలింది. దీంతో అతన్ని సస్సెండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఉత్తర్వులు జారీ చేశారు.


TEJA NEWS