TEJA NEWS

ఆంధ్రప్రభ” తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీని ఆవిష్కరించిన ప్రజా నాయకులు, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

132 – జీడిమెట్ల డివిజన్ సీనియర్ సిటిజన్స్ కార్యాలయం వేదికగా కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ “ఆంధ్రప్రభ” తెలుగు దినపత్రిక క్యాలెండర్ మరియు నూతన డైరీని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ 87 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ విశేష ఆధరణ పొందిన “ఆంధ్రప్రభ” తెలుగు దినపత్రిక యాజమాన్యానికి, పాతికేయ మిత్రులకు శుభాకాంక్షలు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ కుత్బుల్లాపూర్ జోన్ ఇంచార్జ్ ప్రశాంత్ రెడ్డి, విలేకరులు కార్తీక్, ప్రమోద్, ఎల్లారెడ్డి, సంజీవ్ మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS