ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా యువ అధికారికి బాధ్యతలు అప్పగించారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన డాక్డర్ తంగిరాల యశ్వంత్ మొన్నటి వరకు జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేశారు. తాజాగా కీలకమైన సీఎం కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ బాధ్యతల్ని అప్పగించగా.. బాధ్యతల్ని స్వీకరించారు. యశ్వంత్ జమ్మలమడుగు వంటి ప్రాతంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు.. పోలీసు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. దీంతో ఆయన్ను ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా నియమించారు.యశ్వంత్ మొదటి పోస్టింగ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు కాగా.. అక్కడ మంచి అధికారికగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చంద్రగిరి, తిరుపతిలాంటి ముఖ్యమైన చోట్ల విధులు నిర్వహించారు. ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో యశ్వంత్‌కు గుర్తింపు వచ్చింది. తిరుపతి నుంచి పుట్టపర్తికి డీఎస్పీగా వెళ్లారు.. ఆ తర్వాత అక్కడ నుంచి జమ్మలమడుగు డీఎస్పీగా బదిలీ అయ్యారు. యశ్వంత్ వెళ్లిన కొంత కాలానికే ఎన్నికల వచ్చాయి.. జమ్మలమడుగులు ఎన్నికలు సజావుగా జరగడంలో కీలకంగా వ్యవహఱించారు. ఎక్కడా ఎలాంటి పెద్ద అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. విధులు సమర్థవంతంగా నిర్వర్తించడంతో ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ విభాగం అధికారిగా నియమితులయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…