TEJA NEWS

అనిశా వలలో పంచాయతీ కార్యదర్శి

గృహ అనుమతులకు ఆన్లైన్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖకు వలలో చిక్కాడు నందిపేట గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్
కంఠం గ్రామానికి చెందిన సుభాష్ నందిపేట లో ఇల్లు కట్టుకోవడానికి దీనికి సంబంధించిన అనుమతులు ఆన్లైన్ చేయడానికి కార్యదర్శిని సంప్రదించగా 10000 వేలుడిమాండ్ చేశాడు పని ఆలస్యం కావడంతో సుభాష్ మరోసారి కలిశాడు చివరికి 8వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు ఈ విషయంని బాధితుడు వారం కిందట అనిశ అధికారులకు తెలియజేశారు కార్యదర్శి నవీన్ స్వగ్రామం ఉమ్మెండలో ఇంట్లో కూడా సోదాలు చేసినట్లు తెలిసింది గ్రామపంచాయతీ లోని వివిధ దస్త్రాలను రికార్డులను బ్యాంకు ఖాతాలను తదితర వాటిపై ఆరా తీశారు ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ లక్ష్మీ ప్రసాద్ ను పిలిపించి వివిధ రికార్డులను పరిశీలించారు


TEJA NEWS