నేడు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు.
ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చించనున్న మంత్రుల బృందం.
సమస్యల పరిష్కరించకపోతే సమ్మె చేస్తామన్న ఏపీ ఎన్జీవోలు.
ఐఆర్, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్.
పెండింగ్ డీఏలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని పట్టు.
చర్చలు విఫలం ఐతే ఈ నెల 14 వ తేదీన నల్ల బ్యాడ్జీ లతో నిరసన, 15, 16 తేదీల్లో భోజన విరామ సమయంలో ఆందోళనలు చేపడతామని తెలిపారు.
17వ తేదీన ర్యాలీలు, 20వ తేదీన కలక్టరేట్ల వద్ద ధర్నాలు, 21-24 వరకు జిల్లాల పర్యటనలు, 27న ఛలో విజయవాడ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.