TEJA NEWS

మన్మోహన్‌సింగ్‌ మృతి పట్ల ఏపీ మంత్రి లోకేశ్‌ సంతాపం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ మృతి పట్ల మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. “డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో ముందుండి నడిపించిన దూరదృష్టి కలిగిన నాయకుడు ఆయన. కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు.” అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో నారా లోకేష్ ట్వీట్ చేశారు.


TEJA NEWS