TEJA NEWS

టెట్ దరఖాస్తు గడువుపై ఏపీ సర్కార్ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) దరఖాస్తు గడువు పొడిగించినట్లు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దు అని ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు తెలిపారు. ముందుగా ప్రకటించిన ఆగస్టు 3 వరకే దరఖాస్తు గడువు తేదీ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో గడువు పొడిగింపు తేదీ ఉండదని, అర్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


TEJA NEWS