TEJA NEWS

రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి

పల్నాడు జిల్లాలో నూతనంగా రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 2 తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కార్డులకు సంబంధించి ఆధార్ సీడింగ్, రేషన్ కార్డులో కుటుంబ సభ్యులను చేర్చడం వంటివి చేసి, సంక్రాంతి నాటికి కొత్త కార్డులు అందజేస్తామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 6,45,110 రేషన్ కార్డులు ఉన్నాయన్నారు.


TEJA NEWS