వైసిపి సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులను ఖండిస్తూ మాజీ ఉప ముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు జిల్లా అడిషనల్ ఎస్పీకి వినతిపత్రం.
అనకాపల్లి జిల్లా రాష్ట్రంలో వైసిపి సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులను ఖండిస్తూ మాజీ ఉప ముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు జిల్లా అడిషనల్ ఎస్పీకి వినతిపత్రం అందజేశారు, రాష్ట్రంలో వైసిపి సోషల్ మీడియా కార్యకర్తల పై అక్రమంగా కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఏఎస్పి కి వినతిపత్రం అందజేశారు, అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగానే వైసిపి కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని చట్టం అందరికీ సమానమే అయితే, వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టిన టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు