హైదరాబాద్: అటల్ బిహారీ వాజ్‌పేయీ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ కావ్య కిషన్ రెడ్డి హైటెక్స్‌లో దీప్‌మేళా ఎగ్జిబిషన్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ మేళా నిర్వహిస్తారని దీప్ మేళా అధ్యక్షురాలు రాధిక మలానీ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కావ్య కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 200 పైగా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారని, దేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన కళాకృతులు, దుస్తులు, ఇతర గృహోపకరణాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయన్నారు. ఈ మేళా ద్వారా వచ్చిన ఆదాయంతో దీపిక్షా మహిళా క్లబ్ సొంతంగా పాఠశాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. 1987 నుంచి దీపిక్షా మహిళా క్లబ్ కన్యక గురుకుల్ హై స్కూల్‌ను నిర్వహిస్తోంది. దీపిక్షా మహిళా క్లబ్ అధ్యక్షురాలు రాధిక మలానీ మాట్లాడుతూ క్లబ్ సభ్యుల కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఆగస్టు 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ మేళా జరగుతుందని తెలిపారు. ఈ మేళా ద్వారా వచ్చిన ఆదాయాన్ని ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారకు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ మేళా జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
అటల్ బిహారీ వాజ్‌పేయీ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ కావ్య కిషన్ రెడ్డి
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
TEJA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ గౌరవించాయి…
హఫీజ్పెట్ లోని జలమండలి కార్యాలయం లో జరిగిన ప్రజావాణి
TEJA NEWS హఫీజ్పెట్ లోని జలమండలి కార్యాలయం లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని మరియు మంచి నీటి సరఫరా మరియు UGD నిర్వహణ పై జలమండలి అధికారులు , కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , ఉప్పలపాటి శ్రీకాంత్…