నవంబర్ 9న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జరిగే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సభ విజయవంతం చేయాలి
జిల్లా అధ్యక్షుడు భరత్, ప్రధాన కార్యదర్శి గుంటి వినోద్ సాగర్లు పిలుపు
వనపర్తి: జిల్లా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ సమావేశము వనపర్తి పాలిటెక్నికల్ కాలేజీ ఆవరణలో జిల్లా అధ్యక్షులు భరత్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి వినోద్ సాగర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నవంబర్ 9 వ తారీఖున ఆదివారం ఉదయం 10 గంటలకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సభ నిర్వహించనున్నట్లు . ఈ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రామ్ హాజర్ కానున్నట్లు ఇందులో ముఖ్యమైన డిమాండు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడము మరియు సమాన పనికి సమాన వేతనము అవుట్సోర్సింగ్ ఏజెన్సీని రద్దు చేయడం ఉద్యోగ భద్రత కల్పించడం తదితర డిమాండ్లపై ఈ సభను నిర్వహిస్తున్నాము కనుక వనపర్తి జిల్లాలోని ప్రతి ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యతను,బలాన్ని కనపర్చాలని చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ధర్మ, రఘు, తదితరులు పాల్గొన్నారు.
