ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ పడను
** నియోజకవర్గ పర్యటనలో చంద్రగిరి ఎమ్మెల్యే
చంద్రగిరి: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఏమాత్రం రాజీ అనేదే తన దరికి చేరదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతారు…. సమస్యలు తీర్చే వరకు అలుపెరగని పోరాటం చేస్తారు… ఆయనే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అనేలా నిరంతరం కృషి చేస్తున్నారు. చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ పంచాయతీ వంగుమల్లవారిపల్లి గ్రామంలోని తూముగుంట చెరువుకు గండి పడిన
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులను, నాయకులను, ఇరిగేషన్ శాఖ అధికారులను అప్రమత్తం చేసి అప్పటికప్పుడు గండిని ఇసుక మూటలతో పూడిపించారు. గండిపడిన స్థలాన్ని సోమవారం మండల స్థాయి అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.
ముందుగా దేవరకొండ పంచాయతీ పరిధిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. కొన్ని గ్రామాలలో అయితే స్కూటర్ పై ప్రయాణించి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం చూపారు. గత వారంలో కురిసిన భారీ వర్షాలకు చిన్నగొట్టిగల్లు మండలంలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు. మండలంలోని ముంపు ప్రాంతాల ప్రజలను కూటమి నాయకులు అప్రమత్తం చేయాలని అవసరాన్ని బట్టి వారికి అందుబాటులో ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. వరద ప్రభావం తీవ్రత పెరగడంతో వంగుమల్లవారిపల్లి గ్రామంలో ఉన్న తూముగుంట చెరువులోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు. నీరు భారీగా చేరడంతో తూముగుంట చెరువుకు పాక్షికంగా గండి పడింది….. గండి పడటంతో పొలాల మీదకు ప్రవహిస్తున్న వరద నీరు. తూముగుంట చెరువుకు గండిపడిన ప్రదేశాన్ని స్థానిక నాయకులు ఇరిగేషన్ అధికారులతో కలిసి ఇసుక మూటలతో గండిని పూడ్చాల్సిందిగా ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రామస్తులను అప్రమత్తం చేసి… ఇరిగేషన్ అధికారులు , స్థానిక కూటమి నాయకులతో యుద్ధ ప్రాతిపదికన గండిపడిన చోట ఇసుక మూటలను అడ్డుపెట్టి మరమ్మతులు చేయించారు. సోమవారం సమీప గ్రామాలలో పర్యటిస్తూ వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి… గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. తూముగుంట చెరువుకు గండిపడిన కారణంగా ఆనుకుని ఉన్న పొలాలలో భారీగా వరద నీరు వచ్చి చేరింది . వరద నీటి వలన పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసి…. వారందరికీ త్వరితగతిన పంట నష్టం అందేలాగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చెరువు కట్ట మరమ్మత్తులకు ప్రతిపాదన పంపాలని ఇరిగేషన్ అధికారులకు తెలిపారు. కొన్ని గ్రామాలలో స్కూటర్ పై గ్రామాలలో ప్రయాణించి ప్రజల నుండి సమస్యలు తెలుసుకుని కార్యదర్శులు ఇతర అధికారుల ద్వారా కొన్ని సమస్యలను పరిష్కరించారు.
