రాష్ట్రవ్యాప్తంగా “ప్రెస్ క్లబ్” భవననాలు నిర్మించాలి
సాక్షిత : నవంబర్ రెండవ వారంలో…నిరాహార దీక్ష
సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి ప్రారంభం
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు- కందుకూరి యాదగిరి
రాష్ట్రవ్యాప్తంగా “ప్రెస్ క్లబ్” భవనాలు నిర్మించాలని కోరుతూ నవంబర్ రెండవ వారంలో అన్ని జిల్లా కేంద్రాలలో…నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ఒక ప్రత్యేక ప్రకటన లో తెలిపారు.అహర్నిశలు ప్రజలకు ప్రభుత్వానికి సమాచారం అందజేస్తున్న… జర్నలిస్టులకు రాష్ట్రంలో నిలువనీడ లేకుండా పోతుందని జర్నలిస్టుల సంక్షేమం గురించి ఆలోచించే నాధుడు కరువయ్యాడని ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించకపోవడానికి ప్రధానంగా జర్నలిస్టుల సంఘాలలో ఐక్యమత్యం లేకపోవడం ఒక కారణం అని చెప్పారు.కొన్ని ప్రాంతాలలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం భవనాలు నిర్మించడానికి ముందుకు వచ్చినప్పటికీ తమది అంటే తమదే సాగాలని దౌర్భాగ్యమైన ఆలోచన చేస్తున్న యూనియన్ల నాయకుల విధానంతో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ముందుకు వచ్చిన వారు సైతం వారి ఆలోచనను విరమించుకునేలా జర్నలిస్టు సంఘాలలో కొంతమంది చేయడం విచారకరమని తెలిపారు.ఇకనైనా అన్ని యూనియన్ల సంఘాల నాయకులు ఏకతాటిపైకి వచ్చి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని తమలో ఎటువంటి ఇగో ఫీలింగ్స్ ఉన్న పక్కనపెట్టి భవిష్యత్తు రాబోయే తరానికి ఒక చక్కటి బాటలు వేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడాలని కోరారు.నవంబర్ రెండో వారంలో సూర్యాపేట నుండి ప్రారంభించబోయే నిరాహార దీక్ష కార్యక్రమానికి అన్ని యూనియన్ల,ప్రజాసంఘాల, పార్టీల,కుల సంఘాల మద్దతును తీసుకుంటామని యాదగిరి తెలిపారు
