ఎమ్మెల్యేకు ఋణపడి ఉంటాం : ఊటుకూరి రవీందర్
సూర్యపేట జిల్లా ప్రతినిధి: తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామెల్ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేల్పుచర్ల గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్రామానికి నూతనంగా బీటీ రోడ్డు నిర్మాణo చేపట్టుటకు నిధులు కేటాయించడం హర్షణీయమని, అందుకు గ్రామ ప్రజలు పార్టీలకు అతీతoగా ఎప్పటికీ ఋణపడి ఉంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊటుకూరి రవీందర్ అన్నారు. ఆయన విడుదల చేసిన ఓ మాట్లాడుతూ వేల్పుచర్ల గ్రామ ప్రజలు చిరకాల కోరిక అయిన బీటీ రోడ్డు నిర్మాణo కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసినప్పటికీ గత పాలకులు ఏనాడు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామ ప్రజలను కేవలం ఓట్ల రూపంగా మాత్రమే వారు వాడుకొని రోడ్డు నిర్మాణాన్ని మరిచారని వెల్లడించారు.ప్రజల ఆకాంక్షను గమనించిన స్థానిక ఎమ్మెల్యే ప్రజలిచ్చిన మాట ప్రకారం నేడు నెరవేర్చారని హర్షం వ్యక్తం చేశారు.అంతే కాకుండా గ్రామ పంచాయతీ నూతన కార్యాలయం నిర్మాణం,సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించి విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
