వనపర్తి జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు జిల్లా ఎస్పీ:
- ముందస్తు అనుమతి లేకుండా , ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధం:
వనపర్తి: వనపర్తి జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతలను ప్రజ వాతావరణం ప్రశాంతంగా కొనసాగించేందుకు నవంబర్ 01 నుండి నవంబర్ 30 వరకు 30 పోలీస్ యాక్ట్ నిబంధనలు అమల్లో ఉంటాయని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, ఒక ప్రకటనలో తెలిపారు.
పోలీస్ యాక్ట్ ప్రకారం జిల్లాలో డిఎస్పీ లేదా ఆపై పోలీస్ ఉన్నతాధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, లేదా ప్రజలు గుమికూడే కార్యక్రమాలు నిర్వహించడం నిషేధం అని స్పష్టం చేశారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే బహిరంగ సమావేశాలు పూర్తిగా నిషేధించబడతాయనీ. చట్టపరమైన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే, 30 పోలీస్ యాక్ట్ – 1861 ప్రకారం శిక్షార్హులు అవుతారని ఎస్పీ హెచ్చరించారు.
శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా ప్రజల సహకారం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
ప్రజా శాంతి భద్రతల పరిరక్షణే పోలీస్ ప్రధాన బాధ్యతనీ. ఈ నిబంధనలను అందరూ పాటించాలనీ నిబంధనలను ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట పరంగా కఠిన చర్యలు తప్పవనీ ఎస్పీ హెచ్చరించారు .
