చిలకలూరిపేట పట్టణ సుగాలీ కాలనీ వాసుల కనీస అవసరమైన స్మశాన వాటిక ఏర్పాటుకు స్థలం కేటాయించాలి.
రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి
చిలకలూరిపేట పట్టణంలో అర్ధ శతాబ్ది కాలానికి పైగా జిల్లాలోని వివిధ తండాల నుండి జీవనాధారం కోసం వలస వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్న పదివేల మందికి పైగా గల షెడ్యూల్డ్ తెగలకు చెందిన సుగాలీలకు కనీస అవసరమైన ప్రత్యేక స్మశాన స్థలాన్ని కేటాయించాలని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం ప్రసన్నలు విజ్ఞప్తి చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సుగాలీల సమస్యను పరిష్కరించాలని కోరుతూ మండల డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించారు. సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సుగాలీలకు ప్రత్యేక స్మశాన వాటిక స్థలాన్ని కేటాయించి సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మానవుని కనీస అవసరాలలో ఒకటైన స్మశానం లేక నిరుపేద సుగాలీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా సుగాలీల సమస్య పరిష్కారం కాకపోవడం దురదృష్టకరమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సుగాలీలకు స్మశాన వాటిక స్థలాన్ని ఏర్పాటు చేయాలని చిరకాల అపరిష్కృత సమస్యకు పరిష్కారం చూపించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. సుగాలీల స్మశాన వాటిక ఏర్పాటు కు స్థలం కేటాయించేంతవరకు కాంగ్రెస్ పార్టీ దశలవారీ పోరాటాన్ని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం ప్రసన్న రిటైర్డ్ హవల్దార్ మేజర్ కేతావతు మంత్రు నాయక్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ విభాగం నాయకులు కేతావతు సాంబశివ నాయక్ కేతావత్ భీమా నాయక్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇంటూరి భవాని వెంకటేష్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కారుచోల స్వప్న కుమార్ చిలకలూరిపేట మండల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు షేక్ ఖాజాబుడే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పాల బాబు, కె ఆంజనేయులు షేక్ షరీఫ్, షేక్ సునీల్ బాబు, షేక్ ఇస్మాయిల్, షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు.
