AU పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఏపీలో ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల వార్షిక సమ్మేళనం (వేవ్స్)-2024కు సర్వం సిద్ధమైంది. బీచ్ రోడ్డు లోని AU కన్వెన్షన్ సెంటర్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ వార్షిక సమ్మేళనానికి మంత్రి లోకేష్ తో పాటు,ముఖ్య అతిథిగా L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ హాజరు అవుతున్నారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆదినారాయణరావు, పూర్వ విద్యార్థుల సంఘం
వ్యవస్థాపక ఛైర్మన్ (జీఎంఆర్) గ్రంథి మల్లికార్జునరావు సదస్సులో
పాల్గొంటారు.