TEJA NEWS

త్రాగునీటి సమస్య రాకుండా చూడండి

శిల్పారామం కాలనీలో నూతన బోరు తవ్వకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

పుట్టపర్తి మున్సిపాలిటీలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సూచించారు. పుట్టపర్తి మున్సిపాలిటీలోని షాదీ ఖానా వద్ద బుధవారం సత్య సాయి త్రాగునీటి పైప్లైన్ కు ఎమ్మెల్యే చేతుల మీదుగా భూమి పూజ చేశారు అనంతరం శిల్పారామం కాలనీలో త్రాగునీటి పరిష్కారం కోసం నూతన బోరు త్రవ్వకాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ ,పుట్టపర్తి మున్సిపాలిటీలో నీటి ఎద్దడి నివారణకు కోటి 30 లక్షలతో శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

షాది ఖానా వద్ద నీటి సమస్య లేకుండా లక్ష రూపాయలతో పైపు లైన్ ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అదే విధంగా శిల్పా రామం కాలనీలో లో రోడ్లు, త్రాగునీరు మౌలిక వసతులు కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ కాలనీ లో ప్రజలు త్రాగు నీటి సమస్య లేకుండా పూర్తిగా చర్యలు తీసుకుంటామని అందుకు నూతన బోరు త్రవకాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డిచేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి మున్సిపాలిటీ నాయకులు పుడా మాజీ చైర్మన్ కడియాలసుధాకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బెస్త చలపతి ఓబులేసు పట్టణ కన్వీనర్ రామాంజనేయులు మహమ్మద్ రఫీ కౌన్సిలర్ లక్ష్మీపతి ఉమాపతి యాదవ్ అంబులెన్స్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS