TEJA NEWS

The most talented among ten.. Awarding of Reliance prizes to the students

శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని రేవతి హై స్కూల్ లో 2023-2024 సంవత్సరం బ్యాచ్ కు చెందిన విద్యార్థులు పదవ తరగతి చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రిలయన్స్ ట్రెండ్స్ యాజమాన్యం శనివారం బహుమతులు, సర్టిఫికెట్స్, మెడల్స్ ప్రదానం చేశారు. సంజన, శరణ్య, దియా తబుసం, హరీశ్వర్ రెడ్డి, సాక్షిత్ రెడ్డి, సాయి చరణ్, పల్లవి, హర్షిత, కీర్తి లు బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా రిలయన్స్ యాజమాన్యం మాట్లాడుతూ ప్రతిభా వంతులైన గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారు మరింత ఉన్నత స్థానాలను ఎదుగుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ రాజు, గణేష్, ఆనంద్, పట్టాభి, గంగరాజు, భాస్కర్, రాణి, శ్రీవాణి పాల్గొన్నారు.


TEJA NEWS