TEJA NEWS

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటికి వివరించాలి

మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య

వీరులపాడు మండలం : పొన్నవరం గ్రామము నందు శనివారం నాడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం జయహో బీసీ కార్యక్రమంలో భాగంగా కేశినేని ట్రస్ట్ చైర్మన్ కేశినేని శివనాధ్ (చిన్ని) గారు,మండల తెదేపా బీసీ సెల్ పరిశీలకులు చిట్టిబాబు,మధు బాబు గార్లు, జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి గారు వీరులపాడు మండల తెదేపా, జనసేన బీసీ సెల్ నేతలు, జనసేన తెదేపా నేతలతో కలిసి జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య

కామెంట్స్..

రూ 75,760 కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన బీసి ద్రోహి జగన్ రెడ్డి..

ఆదరణ లాంటి 30 పైగా బీసీ సంక్షేమ పథకాలు రద్దు చేశారు.రిజర్వేషన్లు 34% నుండి 24% తగ్గించి బీసీలకు 16,800 రాజ్యాంగ బద్ద పదవులు దూరం చేసిన గుడ్డి ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం.

ఈ నాలుగున్నర ఏళ్లలో 70 వేలకు పైగా బీసీ బ్యాక్ లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయలేదు.

శ్రమతోనే ప్రగతి సాధ్యమని నమ్మి బీసీల ఎదుగుదలే పార్టీ భావజాలంలో భాగంగా చేసుకుని గత 40 ఏళ్లుగా పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ.

ఈ రోజు గ్రామంలో యడ్లపల్లి పట్టాభిరామయ్య కోటేశ్వరమ్మ గారి దంపతుల కుమారుడు ఎన్నారై యడ్లపల్లి రాకేష్ సహకారంతో గ్రామంలో చంద్రన్న సంక్రాంతి కానుకలు అందజేయడం జరిగినది

ఎక్కడో విదేశాలలో ఉన్న గ్రామముపై మమకారంతో ఎన్నారై రాకేష్ అందిచిన సహకారానికి ప్ర అభినందనలు, దానికి సహకరించి పూర్తి సహాయ సహకారాలు అందించిన గ్రామ తెదేపా కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా దేశంలోనే మొదటిసారిగా “బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాల అండగా నిలవాలని నిశ్చయించిన” పార్టీ తెలుగుదేశం పార్టీ..

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమము ద్వారా సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటికి వివరించాలి

వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు,చేసిన అవినీతిని ప్రజలకు తెలియజేయాలి

వైసీపీ ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాల వారు వారి హక్కులను కోల్పోయారు.. జగన్మోహన్ రెడ్డి ఉద్దరించింది ఏమీ లేదు

కనీసం రోడ్లకు పడిన గుంతలు కూడా పూడ్చలేని గుడ్డి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం

ప్రజాక్షేత్రంలో జగన్ కి చోటు లేదు.వైసీపీ పార్టీ త్వరలో బంగాళాఖాతంలో కలిసిపోతుంది

రాష్ట్రానికి ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలని జనసేన పవన్ కళ్యాణ్ గారు,తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయబోతున్నాయి


TEJA NEWS